![]() |
![]() |
.webp)
కౌశల్ మందా గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే అత్యధిక ఫాలోయింగ్ ని సంపాదించుకున్న కంటెస్టెంట్గా కౌశల్ మందా. కౌశల్ ఆర్మీ కూడా అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 2 టైములో కౌశల్ ఇమేజ్ ఓ రేంజ్ లో ఉండేది. ఆయన కోసం అప్పట్లో చాలా కార్యక్రమాలు చేసారు. తనను తాను ఓ హీరోలా ప్రొజెక్ట్ చేసుకున్నాడు కౌశల్. నానిపై కూడా కౌశల్ అభిమానులు ఫైర్ అయ్యే రేంజ్ లో ఉంది కౌశల్ పవర్ . అలాంటి కౌశల్ తర్వాత కొన్ని షోస్ చేసాడు. తన ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ పెడుతూ ఉంటాడు. వాళ్ళ పిల్లల్తో కలిసి చేసిన వీడియోస్ ని కూడా షేర్ చేస్తూ ఉంటాడు.
.webp)
రీసెంట్ గా అలాంటి ఒక వీడియోని పోస్ట్ చేసాడు . వాళ్ళ అమ్మాయిని వేప చెట్టు దగ్గరకు తీసుకువెళ్లి అక్కడ వేప పుల్ల విరిచి చేతికి ఇచ్చాడు. ప్రపంచంలోకి ఇదే బెస్ట్ టూత్ పేస్ట్ అని చెప్పాడు. వారానికి ఒక్కసారైనా వేప పుల్లతో పళ్ళు తోముకుంటే పళ్లలో ఉండే బాక్టీరియా అంతా చచ్చిపోతుంది అని చెప్పాడు. ఇక తన కొడుకు, కూతురు, మరో బాబుకు కూడా వేప పుల్లలు ఇచ్చి పళ్ళు తోమించాడు. మా తాతల టైంలో ఈ వేపపుల్లలతోనే తోముకునే వాళ్ళు, తర్వాత బొగ్గుతో తోముకునే వాళ్ళు, ఆ తర్వాత పేస్ట్ లు వచ్చాయి అని తన కూతురికి ఎక్స్ప్లైన్ చేసాడు. ఈ వీడియో చూసాక నెటిజన్స్ అంతా కూడా తమ చిన్నప్పుడు వేప పుల్లతోనే పళ్ళు తోముకునే వాళ్ళం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |